ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 ఛాంపియన్ గా ముంబై ఇండియన్స్ అవతరించింది
హర్మాన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ మెరుపులు, నాట్ సీవర్ బృంట్ అల్ రౌండ్ జోరు, ఇస్మాయిల్, కెర్ ల సూపర్ బౌలింగ్ ముంబై ఇండియన్స్ ని ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 ఛాంపియన్ గా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించాయి
150 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ కు మొదటి నుండి అన్ని కష్టాలే.
ఫామ్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు కెప్టెన్ లానింగ్, షెఫాలీ వర్మ లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఆ తరవాత వచ్చిన జొనాసేన్, సదర్లాండ్ లు కూడా వెంట వెంటనే అవుట్ అవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయింది
జెమిమా రోడ్రిగ్స్(30) , మరిజానే కాప్ (40) క్రీజ్ లో ఉన్నంతవరకు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆశలు ఉన్నాయి. వీరిద్దరూ అవుట్ అవడంతో ముంబై ఇండియన్స్ విజయం ఖాయమైంది. నీకీ ప్రసాద్ కొంత ప్రతిఘటించిన ఫలితం లేకపోయింది
చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది
ముంబై ఇండియన్స్ బౌలర్ల లో సూపర్ ఫామ్ లో ఉన్న బృంట్ 3 వికెట్లు తీయగా, అమేలియా కెర్ రెండు వికెట్లు తీశారు. ఇషాక్, ఇస్మాయిల్, మాధ్యుస్ లు తలా ఒక వికెట్ తీశారు
అంతకు ముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది
ముంబై ఇండియన్స్ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే వన్ డౌన్ లో వచ్చిన నాట్ సీవర్ బృంట్, కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ లు మూడవ వికెట్ కు 89 పరుగులు జోడించారు. 30 పరుగులు చేసిన బృంట్ అవుట్ అయ్యిన తరవాత హర్మాన్ ప్రీత్ కౌర్ కు సహకారం అందించే వారే కరువయ్యారు
44 బంతుల్లో 66 పరుగులు చేసి హర్మాన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిన తరవాత ముంబై ఇండియన్స్ మరింత ఇబ్బందుల్లో పడింది
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో బృంట్, హర్మాన్ ప్రీత్ కౌర్ లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కమలిని సరిగా 10 పరుగులు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో చరని, కాప్, జొనాసేన్ లు రెండేసి వికెట్ లు తీశారు. సదర్లాండ్ ఒక వికెట్ తీసింది

