ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ లో టాస్ గెలిచినా ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది
ముంబై ఇండియన్స్ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే వన్ డౌన్ లో వచ్చిన నాట్ సీవర్ బృంట్, కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ లు మూడవ వికెట్ కు 89 పరుగులు జోడించారు. 30 పరుగులు చేసిన బృంట్ అవుట్ అయ్యిన తరవాత హర్మాన్ ప్రీత్ కౌర్ కు సహకారం అందించే వారే కరువయ్యారు
44 బంతుల్లో 66 పరుగులు చేసి హర్మాన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిన తరవాత ముంబై ఇండియన్స్ మరింత ఇబ్బందుల్లో పడింది
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో బృంట్, హర్మాన్ ప్రీత్ కౌర్ లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కమలిని సరిగా 10 పరుగులు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో చరని, కాప్, జొనాసేన్ లు రెండేసి వికెట్ లు తీశారు. సదర్లాండ్ ఒక వికెట్ తీసింది
ముంబై ఇండియన్స్ ఈ స్కోర్ ను కాపాడుకుంటుందా లేదా ఢిల్లీ క్యాపిటల్స్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందా అనే విషయం తెలియాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి 8 ఓవర్ల ఆటను బట్టి ఉంటుంది

