విక్రమ్ ‘వీర ధీర సూరన్‌’ పవర్ ప్యాక్‌డ్‌ టీజర్

by | Mar 15, 2025 | సినిమా

తమిళ అగ్ర కథానాయకుడు చియాన్ విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘వీరధీరసూరన్‌’. ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగం. దుషారా విజయన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య, సూరజ్‌ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో శ్రీలక్ష్మి మూవీస్‌, తెలంగాణలో ఎన్‌వీఆర్‌ బ్యానర్లు విడుదల చేయనున్నారు. కాగా, ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన వీరధీరసూరన్‌ టైటిల్‌ టీజర్‌ పవర్ ప్యాక్‌డ్‌ యాక్షన్ ఎలిమెంట్స్‌తో మూవీ ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 27న వీరధీరసూరన్‌ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుండగా.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పవర్ ప్యాక్‌డ్‌ టీజర్ ను పరిశీలిస్తే.. హీరో చిన్న కిరాణా దుకాణం నడుపుతూ ఉపాధి పొందుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ హీరోకి ఎవరూ ఉహించని ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇదే ఈ మూవీ స్టోరీ లైన్ లా అనిపిస్తుంది. ఇదిలాఉంటే.. మరోవైపు విక్రమ్‌ స్టార్ డైరెక్టర్ గౌత‌మ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.