తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. బుట్ట బొమ్మ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ చిత్రం కావడం విశేషం. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాల తర్వాత లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు సమాచారం. కూలీ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం బడా ఓటీటీ సంస్థలు పోటీపడినప్పటికి ఆఖరికి అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘జైలర్’ ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోనే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండగా.. ఇప్పటికే విడుదలైన కొన్ని మూవీ పోస్టర్లు, అలాగే టైటిల్ టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. యాభై ఏళ్ళ కాల వ్యవధిలో జరిగే ఈ సినిమా కథలో దేవాగా పవర్ఫుల్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారని, ఆయన పాత్రలో విభిన్న కోణాలుంటాయని, కథలో ఊహించని మలుపులు ఉంటాయని సమాచారం.

