మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరగుతుండగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి ఇచ్చిన ట్యూన్స్ అదిరిపోయాయని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ‘రామ రామ’ అంటూ సాగే సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలువనుందని చిత్ర యూనిట్ చెప్తున్నారు. ఇటీవలే ఈ సాంగ్ కోసం వేసిన ఓ భారీ సెట్లో 600 మంది డ్యాన్సర్లతో కలిసి చిరు స్టెప్పులు వేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లోనే మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ కూడా చిరుతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేస్తాడని తెలుస్తోంది. ఈ సాంగ్ కు వస్తున్న హైప్ చూసిన మేకర్స్ ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ గా ఈ సాంగ్‌నే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. కాగా, ‘విశ్వంభర’లో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

