ఫిబ్రవరి 20 – మెగా స్టార్ చిరంజీవి, సురేఖ గార్ల పెళ్లి రోజు. రెండు రోజుల క్రితం సురేఖ గారు పుట్టిన రోజు జరుపుకున్నారు
అల్లు రామలింగయ్య (Allu Rama Lingayya) గారు మద్రాస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పై వాటా లో సత్యనారాయణ అనే వ్యక్తి ఉండేవాడు. ఈ సత్యనారాయణ మన చిరంజీవి (Chiranjeevi) గారి స్నేహితుడు. సత్యనారాయణను కలవడానికి, చిరంజీవి వస్తూ ఉండేవాడు. చిరంజీవి ని చూసిన కనకరత్నం గారు సత్యనారాయణ ద్వారా చిరంజీవి గురించిన వివరాలు తెలుసుకున్నారు. ఆ తరవాత, ఈ విషయం అల్లు రామలింగయ్య గారితో, కొడుకు అల్లు అరవింద్ (Allu Aravind) తో ఆ అబ్బాయి చిరంజీవి ని మన చిట్టికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అన్నారట. ఈ విషయం అంత మన చిరంజీవి కి తెలియదు.
మొదట్లో అల్లు రామలింగయ్య గారికి ఇష్టం లేకపోయినా, ఒకసారి రాజమండ్రి నుండి మద్రాస్ రైల్లో వస్తుండగా చిరంజీవి గారిని చూసారు అల్లు రామలింగయ్య గారు. చిరంజీవి ప్రవర్తన చూసాక అల్లు రామలింగయ్య గారు కూడా సరే అన్నారు. అప్పుడు మన అల్లు అరవింద్ రంగంలోకి దిగాడు. నిర్మాత జయ కృష్ణ ద్వారా చిరంజీవి స్థితిగతులు తెలుసుకున్నాక చిరంజీవి తల్లి తండ్రులతో మాట్లాడడం, పెళ్లి చూపుల తతంగం అంత ఒక దాని తరవాత ఒకటి అలా జరిగిపోయాయి
నిశ్చయ తాంబూలాల కార్యక్రమం మాత్రం అన్న గారు నందమూరి తారక రామారావు గారు సమక్షంలో జరిగింది. కొణిదెల వారి పెద్దబ్బాయి, అల్లు వారి చిన్నమ్మాయి వివాహ ముహూర్తం ఫిబ్రవరి 20 (1980) గా నిర్ణయించారు. అదే రోజు ఏం ఎస్ రెడ్డి గారు నిర్మిస్తోన్న తాతయ్య ప్రేమలీలలు సినిమా షూటింగ్ ఉంది. రెడ్డి గారిని ఎలా అడగాలి అని ఆలోచిస్తుండగా, అల్లు అరవింద్ ఈ విషయాన్నీ గ్రహించి రెడ్డి గారికి విషయం వివరించి కాబోయే బావగారైన చిరంజీవి కి టెన్షన్ తగ్గించాడు.
వివాహం జరిగిన తేదీ మరియు సంవత్సరం : ఫిబ్రవరి 20, 1980.
వివాహం జరిగినది : రాజేశ్వరి కల్యాణ మండపం, మద్రాస్.
వివాహ ముహూర్తం : ఉదయ 11 గంటల 50 నిముషాలు.
పెళ్ళైన తర్వాత రోజు చిరంజీవి (Chiranjeevi) నటించిన అగ్ని సంస్కారం సినీ విడుదల అయ్యింది. చిరంజీవి, సురేఖ తో సినిమాకు వెళ్లారు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. సురేఖ గారు చిరంజీవి ని మాత్రం మొదటి సారిగా ఒక సినీమా ఫంక్షన్ లోచూశారు. ఆ ఫంక్షన్ కు చిరంజీవి పైజామా, జుబ్బా తొడుక్కొని వచ్చాడు. సినిమా హీరో, జర్నలిస్ట్ గా వచ్చాడేంటి అని సురేఖ గారు అనుకున్నారట
మెగా స్టార్ చిరంజీవి, సురేఖ గార్లకు 45 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

