మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ మూవీ తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ షేర్ చేశారు.
‘ఓదెల 2’ మూవీ టీజర్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ మేళాలో ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నారు. దింతో మహాకుంభ్ మేళాలో
టీజర్ రిలీజ్ చేసుకోనున్న మొదటి భారతీయ సినిమాగా ‘ఓదెల 2’ మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ టీజర్ విడుదల కార్యక్రమానికి చిత్రబృందంతో పాటుగా సినీ ప్రేమికులు హాజరవనున్నారు. ఈ సినిమాలో తమన్నా నాగసాధు పాత్రలో నటిస్తోంది. ఈ రోల్ కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుందని ఈ సినిమాలో తమ్మన్నా పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంటున్నారు.

