అరంగేట్రంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడి రికార్డు స్కోర్, అయినా తప్పని ఓటమి

by | Feb 10, 2025 | వార్తలు

న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న ముక్కోణపు సిరీస్ లో భాగాంగా, ఈ రోజు లాహోర్ లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

అయితే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఓపెనర్  Matthew Breetzke అరంగేట్ర మ్యాచ్ లోనే ప్రపంచ రికార్డు సృష్టించాడు. 

26 ఏళ్ళ సౌత్ ఆఫ్రికా క్రికెటర్ Matthew Breetzke అరంగేట్ర మ్యాచ్ లో 150 పరుగులు (11×4 | 5×6) చేసి, వెస్ట్ ఇండీస్ ఆటగాడు డెస్మండ్ హేన్స్ (148 పరుగులు) పేరిట ఉన్న 46 ఏళ్ళ రికార్డు ను బద్దలు చేశాడు.

మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 50 ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.

ఆరంగేట్ర ఆటగాడు Matthew Breetzke 150 పరుగులు చేయగా, ముల్డర్ 64 పరుగులు, జాసన్ స్మిత్ 41 పరుగులు చేశారు

న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, రూర్కే చెరో రెండు వికెట్లు తీశారు.  బ్రేస్ వెల్ ఒక వికెట్ తీశాడు

అనంతరం 305 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ డెవాన్ కాన్వే , విలియమ్సన్ విజృంభించడంతో 48.4 ఓవర్లలో చేధనను పూర్తి చేశారు

డెవాన్ కాన్వే 97 పరుగులు చేసి అవుట్ అవ్వగా, విలియమ్సన్ 133 పరుగులతో అజేయంగా నిలిచాడు.  లియమ్సన్ కు తోడుగా ఫిలిప్స్ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు

అరంగేట్ర మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఆటగాడు రికార్డు సెంచరీ చేసినా, బౌలర్ లు విఫలం కావడంతో సౌత్ ఆఫ్రికా కు ఓటమి తప్పలేదు. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ కు దక్కింది