రవితేజ ‘మాస్‌ జాతర’ – ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

by | Apr 12, 2025 | సినిమా

టాలీవుడ్ నుంచి వ‌స్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ ‘మాస్‌ జాతర’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా న‌టిస్తున్న ఈ సినిమాతో ‘సామజవరగమన’ రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ మూవీ నుంచి ‘తూ మేరా లవర్’ అనే పాటను ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. అయితే ర‌వితేజ సూపర్ హిట్ ఇడియట్ మూవీలో ‘చూపుల‌తో గుచ్చి గుచ్చి చంపకే’ సాంగ్ ను ఇందులో రీమిక్స్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ (Ravi Teja), శ్రీలీల (Sree Leela) వేసే డ్యాన్సులు అలరిస్తాయని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఏప్రిల్ 12న ఈ మూవీ నుంచి ప్రోమోను పంచుకున్నారు మేకర్స్. ‘తూ మెరా లవర్’ అంటూ ఫుల్ ఎనర్జీటిక్‌గా సాగిన ఈ ప్రోమో రవితేజ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. భీమ్స్ సిసిరిలీయో సంగీతం అందిస్తున్న ఈ పాట యూత్ ను ఆకట్టుకొవడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ జాతర చిత్రాన్ని సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇదివ‌ర‌కే ఈ సినిమా నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌లు అభిమానుల్ని ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

https://twitter.com/SitharaEnts/status/1910944975023636510