టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా విశ్వంభర మూవీలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ను ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేశారు మేకర్స్. “రాములోరి గొప్ప చెప్పుకుందామా.. రాములోరి గొప్ప చెప్పుకుందామా.. సాములోరి పక్కన ఉన్న సీతమ్మ లక్షణాలు చెప్పుకుందామా’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ను కీరవాణి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సరస్వతీ పుత్ర శ్రీ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను శంకర్ మహదేవన్ అద్భుతంగా పాడారు. ఫుల్ ఎనర్జీటిక్గా సాగిన ఈ పాట విజువల్ వండర్ అని చెప్పొచ్చు. ఈ సాంగ్ మెగా అభిమానులతో పాటుగా సినీ ప్రియుల్ని ఎంతగానో అలరిస్తుంది. ఓసారి మీరు చూసేయండి..

