ఇప్పటిదాకా కుటుంబ తగాదాల వరకు ఉన్న మంచు బ్రదర్స్ మధ్య గ్యాప్ ఇప్పుడు సినిమాల దాకా వచ్చింది. మంచు మనోజ్ మాట్లాడుతూ, మా భైరవం సినిమా ఏప్రిల్ నెలాఖరులో వస్తోంది. అందుకే మంచు విష్ణు భయపడి కన్నప్ప ను వాయిదా వేశాడు అని మంచు మనోజ్ అంటున్నారు
ఇక్కడ రెండు విషయాలు ఆలోచించాలి. రెండు సిన్మాలు ఒకే సారి విడుదలై విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు చిరంజీవి హిట్లర్, బాల కృష్ణ పెద్దన్నయ్య నుండి ఈ మధ్య కాలం లో వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వరకు.
ఇక రెండో విషయం ఏంటంటే, భైరవం, కన్నప్ప సినిమాలలో కన్నప్ప కే ఓపెనింగ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటె కన్నప్ప పాన్ ఇండియా చిత్రం. అందునా భక్తిరస చిత్రం. సహజంగా అంచనాలు ఉంటాయి. పైగా ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, మోహన్ లాల్ వంటి భారీ తారాగణం ఉంది. భైరవం లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఉన్నారు. ఈ చిత్ర దర్శకుడు నాంది వంటి హిట్ సినిమా తీసిన విజయ కనకమేడల. అయితే ఈ సినిమా బాగుంది అనే టాక్ వచ్చిన తరవాత జనాలు థియేటర్స్ కి వెళతారు. కానీ కన్నప్ప కు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది.
ఈ రెండు సినిమాలు బాగున్నా, బాగాలేకపోయినా ఒకే సారి వస్తే ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. కొద్దో గొప్పో భైరవం సినిమా కు కూడా ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరి మంచు మనోజ్ కూడా భైరవం సినిమా ని జూన్ కి వాయిదా వేస్తాడా. భైరవం పూర్తి మంచు మనోజ్ సినిమా కాదు కాబట్టి అంత ధైర్యం చేయకపోవచ్చు. చూద్దాం మంచు వారి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ హిట్ కొడతాయో

