విడుదల తేది: 10–04–2025
నటీనటులు: అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, సునీల్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: అభినందన్ రామానుజం
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
కోలీవుడ్ సీనియర్ హీరో అజిత్ కుమార్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. యోగిబాబు, రాహుల్ దేవ్, అర్జున్ దాస్, ప్రభు ఇతక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది ? అజిత్ కుమార్ ఆడియన్స్ ను ఎలా మెప్పించారు? అజిత్ కుమార్, త్రిష కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
ముంబైలో ‘రెడ్ డ్రాగన్’ అలియాస్ ఏకే అనే పేరుతో మాఫియా డాన్‌గా (అజిత్) క్రిమినల్ జీవితం గడుపుతుంటాడు. కానీ తన భార్య కోసం అన్నీ వదిలేసి 18 ఏళ్ళు జైలు జీవితంలో ఉంటాడు. ఆ తర్వాత కొడుకు విహాన్ (కార్తికేయ దేవ్) 18వ పుట్టినరోజున బయటికి వస్తాడు. అయితే అదే సమయంలో విహాన్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన కొడుకును కుట్రపూరితంగా ఇందులో ఇరికించారని తెలియడంతో ఏకే మరోసారి డాన్ అవతారమెత్తుతాడు. దీనికంతటికీ జానీ (అర్జున్) కారణమని తెలుస్తుంది. ఇంతకీ ఏకే కొడుకుని జానీ ఎందుకు టార్గెట్ చేశాడు ?అసలు ఏకే గతం ఏమిటి? అతను పవర్ ఫుల్ డాన్ గా ఎలా మారాడు? కొడుకు విహాన్ ను కేసు నుంచి ఎలా బయటపడేశాడు ? ఈ క్రమంలో ఎదుర్కొన్న సమస్యలేమిటి ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో నిజానికి
కథ గురించి చెప్పుకోవడానికి అంతగా ఏం లేదు. దర్శకుడు హీరో ఎలివేషన్, స్క్రీన్ ప్లే తోనే రెండున్నర గంటలు లాగించేశాడు. ఇందులో చాలా కాలం తర్వాత వింటేజ్ అజిత్ కుమార్ కనిపించారు. ఆ స్టైల్, యాక్షన్ అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంది. హీరోయిన్ త్రిష పాత్ర ప్రభావవంతంగా లేదు. కేవలం గ్లామరస్ గా మాత్రమే త్రిష ఆకట్టుకుంది. హీరోకి అనుచరుడి పాత్రలో కనిపించిన సునీల్,
విలన్ పాత్రలో అర్జున్ దాస్ తమ నటనతో మెప్పించాడు. అజిత్ కొడుకు పాత్రలో ‘సలార్’ ఫేమ్ కార్తికేయ దేవ్ ఆకట్టుకున్నాడు. యోగిబాబు, జాకీష్రాఫ్, సిమ్రాన్ ముఖ్య పాత్రల్లో అలరించారు. ప్రియ ప్రకాష్ వారియర్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అలరించింది. సినిమాటోగ్రఫీ అందించిన అభినందన్ రామానుజం పనితీరు బాగుంది. విజువల్స్ క్వాలిటీగా ఉన్నాయి. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కథ మీద కంటే అజిత్ అభిమానుల్ని సంతృప్తి పరిచేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కథ, కథనం విషయంలో తడబడినప్పటికీ అభిమానుల్ని అలరించడంలో మాత్రం విజయం సాధించాడు.
ప్లస్ పాయింట్స్:
అజిత్ కుమార్ నటన
యాక్షన్ సన్నివేశాలు
ఛాయాగ్రహణం
మైనస్ పాయింట్స్:
రొటీన్ గా సాగే ఫస్టాఫ్
ఆసక్తి రేకెత్తించని కథ, కథనం
రేటింగ్: 2.75/5

