Mana Shankara Vara Prasad garu నుండి వచ్చిన మొదటి పాట ‘మీసాల పిల్ల..’. ఈ పాట విడుదలైనప్పుడు ట్రోల్ చేశారు. అయితే ఈ పాట సోషల్ మీడియా లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. భాస్కర బట్ల రవికుమార్ రాసిన ఈ పాటను ఉదిత్ నారాయణ , శ్వేతా మోహన్ లు పాడారు. భీమ్స్ స్వర సారధ్యం వహించారు
ఈ మీసాల పిల్ల పాట మీద ఎన్నో రీల్స్, షార్ట్స్ వచ్చాయి. చాలా సంవత్సరాల తరవాత పాటలో పదాలు స్పష్టంగా అర్ధం అవడం, చిరంజీవి హుక్ స్టెప్, భార్య, భర్తలకు గొడవలకు సంబందించిన పాట కావడం వంటి అంశాలు ఈ పాట సూపర్ హిట్ కావడానికి దోహదం చేశాయి. ఈ మీసాల పిల్ల పాట టి సిరీస్ యూట్యూబ్ ఛానల్ లో 100 మిలియన్ వ్యూస్ ని సాధించి సరి కొత్త రికార్డు సృష్టించింది
మీసాల పిల్ల… పాట తరవాత వచ్చిన శశిరేఖా .., మెగా విక్టరి మాస్ సాంగ్ లు కూడా బాగానే ఉన్నా మీసాల పిల్ల సాంగ్ రేంజ్ లో హిట్ అవలేదు.

