Mana Shankara Vara Prasad Garu : ట్రైలర్ సరే, మెగా స్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ మాటేంటి
అనిల్ రావిపూడి, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తోన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు; నుండి విడుదలైన మెగా విక్టరీ మాస్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటికే ఈ పాట 20 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం నుండి విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
జనవరి 12 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. జనవరి 11 రాత్రి నుండి ప్రీమియర్ సందడి మొదలవుతోంది.
అయితే సినిమా విడుదల అవడానికి ఇంకా వారం మాత్రమే ఉంది. మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ ఈ జనవరి 4 న విడుదలవుతున్నట్లుగా నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ల గురించి తెలియాలి. ఈ పాటకు ఆట సందీప్ కోరియోగ్రఫీ చేశారని తెలుస్తోంది. ఆట సందీప్ తన అభిమాన హీరో చిరంజీవి కి ఎలాంటి స్టెప్స్ కంపోజ్ చేశారో అని అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ చేస్తారు అనే విషయం కూడా తెలియాలి. అనిల్ రావిపూడి ఇంకా వేరే ఏమైనా పోస్ట్ రిలీజ్ ప్రొమోషన్స్ ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహిస్తున్నారు.

