మన శంకర వర ప్రసాద్ గారు : చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్

by | Jan 19, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం సంక్రాతి విన్నర్ గా నిలిచింది.  వింటేజ్ చిరంజీవిని చూపించిన విధానం, తండ్రి కూతుళ్ళ బంధం, భార్య భర్తల సంబంధం, వెంకటేష్ పాత్ర వంటి అంశాల కు  కామెడీ ని  మేళవించి అనిల్ రావిపూడి ఈ సంక్రాంతి కి కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. 

ఈ సినిమా చూడడానికి, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు తరలి వస్తున్నారు. ఒక్కొక్కరు కనీసం రెండు సార్లు ఈ సినిమా చూస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా మన శంకర వర ప్రసాద్ 300 కోట్ల గ్రాస్ వసూళ్లతో చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది

నార్త్ అమెరికా లో కూడా మన శంకర వర ప్రసాద్ గారు 3 మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్స్ సరిగమ సినిమాస్ ఎక్స్ వేదికగా ప్రకటించింది

షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పై సుష్మిత కొణిదెల లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.