మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘ఆదర్శ కుటుంబం AK47’ (Aadarsha Kutumbam) టైటిల్ తో రానున్న ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా ‘హౌస్ నెం. 47, ఎ.కె. 47’ అని పెట్టారు. హారిక అండ్ హాసిని పతాకంపై దీనిని సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్ (Venkatesh) సరసన కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ త్వరగా పూర్తి చేసి.. ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని పక్కా ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో రోహిత్ కీలక పాత్రలో నటించనున్నాడని ఇన్సైడ్ టాక్. నారా రోహిత్ (Nara Rohit) ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో చేరాడని ఇప్పటికే తన మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాగా, అంతకుముందు హీరో వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పని చేయగా.. ఆ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలిచాయి. దాంతో ఇప్పుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో వెంకటేష్ సినిమా రానుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

