లేటెస్ట్ బాలీవుడ్ సెన్సషనల్ హిట్ ‘దురంధర్’ (Durandhar). ప్రస్తుతానికి దురంధర్ ఇండియా లో 879.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించి 900 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. గల్ఫ్, అరబ్ దేశాలలో విడుదల చేస్తే వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
దురంధర్ వసూళ్లు
- మొదటి వారం : 218.00 కోట్లు
- రెండవ వారం : 261.50 కోట్లు
- మూడవ వారం : 189.30 కోట్లు
- నాలుగవ వారం : 115.70 కోట్లు
- ఐదవ వారం : 56.35 కోట్లు
- ఆరవ వారం : 28.95 కోట్లు
- ఏడవ వారం : 9.95 కోట్లు (మూడు రోజులకు_
ఒకే భాషలో అత్యధికంగా సుమారు 1300 కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతే కాకుండా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో నాలుగవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో దంగల్, రెండవ స్థానంలో బాహుబలి, మూడవ స్థానంలో పుష్ప-2 ఉన్నాయి
అంతే కాకుండా ఇండియా లో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. పుష్ప-2 (Pushpa-2_పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టింది దురంధర్.
ఇప్పటికి దురంధర్ వారానికి కనీసం 20 కోట్లు తగ్గకుండా వసూళ్లు సాధిస్తోంది. అయితే, రిపబ్లిక్ డే సందర్భంగా బోర్డర్ -2 (Border 2) విడుదలవుతోంది కాబట్టి వసూళ్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
రణ్ వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, సారా అర్జున్ లు నటించిన హిందీ సినిమా దురంధర్ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు ఆదిత్య ధర్. ఆదిత్య ధర్ గతంలో ఉరి వంటి చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతనికి ఇది రెండవ సినిమా మాత్రమే.
దురంధర్ పార్ట్ 2(Durandhar) – రివెంజ్ ను మార్చ్ 19, 2026 న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


