శర్వానంద్- శ్రీను వైట్ల మూవీలో హీరోయిన్ ఫిక్స్.!

by | Jan 20, 2026 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) నటించిన ‘నారి నారి నడుమ మురారి’ (Nari Nari Naduma Murari) మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే శర్వానంద్‌ తన తదుపరి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించాడు. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి నుంచే చిత్రీకరణ ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. సినిమా తారాగణానికి సంబంధించిన విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. మైత్రీ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోండగా… ఇందులో క‌థానాయిక‌గా ఆషికా రంగనాథ్ (Ashika Ranganadh) ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అషికా ఇటీవలే రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన సంగతి తెలిసిందే.

ఇటీవ‌ల దర్శకుడు శ్రీను వైట్ల క‌థ‌ని అషికాకి చెప్ప‌గా, ఆమె ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. శర్వానంద్ (Sharwanand) ప‌క్క‌న హీరోయిన్ గా అషికా బాగుంటుంద‌ని, వారి జోడి చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర కోసం డైరెక్టర్ శ్రీను వైట్ల డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో శర్వా ని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట శ్రీను వైట్ల. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.