మహావతార్ నరసింహ రికార్డుల మోత ..ట్రైలర్ విడుదల

by | Aug 24, 2025 | సినిమా

మహావతార్ నరసింహ, యానిమేషన్ చిత్రం.  ఎటువంటి హడావిడి లేకుండా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కూలీ, వార్ 2 చిత్రాల వసూళ్లు పడిపోయినా, ఇప్పటికి మహావతార్ నరసింహ (Mahavathar Narasimha) వసూళ్లు నిలకడగా ఉన్నాయి.

8 రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ యానిమేషన్ (Indian Animation) చిత్రంగా మహావతార్ నరసింహ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం 8 రోజుల్లో 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది

జులై 25 న విడుదలైన ఈ మహావతార్ నరసింహ (Mahavathar Narasimha) ఇప్పటిదాకా 278 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా మేకర్స్ కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు.

అశ్విన్ కుమార్ (Ashwin Kumar) ఈ మహావతార్ చిత్రానికి దర్శకుడు. హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) వారు ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేశారు.