ఐస్ క్రీం వెండర్ కు చుక్కలు చూపించిన మహానటి కీర్తి సురేష్

by | Mar 21, 2025 | వార్తలు

ఐస్ క్రీం లు అమ్మేవాళ్ళు ఐస్ క్రీం మనకు ఇస్తూ, మన చేతికి చిక్కకుండా మనల్ని ఆడిస్తూ ఉంటారు.  చాల మందికి సరదాగా ఉంటుంది.

టర్కిష్ ఐస్ క్రీం అమ్మేవాళ్ళు ఇలాంటి గారడీ విద్యలు ప్రదర్శిస్తూ ఉంటారు. వేళ్ళు చేసే తక్కు టమార విద్యలకు ఒక్కోసారి చికాకు వస్తుంది

మహానటి కీర్తి సురేష్ ను కూడా ఒక ఐస్ క్రీం అమ్మే వ్యక్తి కీర్తి సురేష్ కు ఐస్ క్రీం ఇవ్వకుండా చాల సేపు ఆట పట్టించాడు. ఆ తరవాత ఐస్ క్రీం ఇచ్చేశాడు. అయితే తిన్న ఐస్ క్రీం కు డబ్బులు ఇచ్చేటప్పడు, ఈ సరి మహానటి కీర్తి సురేష్ అవకాశం తీసుకుంది.  ఐస్ క్రీం వెండర్ వాడిన టక్కు, టమార విద్యలను వాళ్ళ మీద ప్రయోగించింది. డబ్బులు తీసుకోమని వాళ్ళకి ఇచ్చినట్లే ఇచ్చి ఆటు, ఇటూ తిప్పి ఒక ఆట ఆడించింది.  దీనితో ఆ ఐస్ క్రీం అమ్మే వ్యక్తి ఖంగు తిన్నాడు.  దీనిపై కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ లో జస్ట్ ఫర్ ఫన్ అని పోస్ట్ చేసింది.  ఈ వీడియో ని ఎక్స్ లో పోస్ట్ చేసింది

కీర్తి సురేష్ ఈ మధ్యనే తన స్నేహితుడు ఆంటోనీ ని వివాహం చేసుకుంది. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో వచ్చినా మహానటి కీర్తి సురేష్ రివాల్వర్ రీటా సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది