సచిన్, బిల్ గేట్స్ వడాపావ్ బ్రేక్ లో ముచ్చట్లు 

by | Mar 21, 2025 | వార్తలు

ప్రస్తుత బిల్ గేట్స్ భారత దేశంలో పర్యటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే

బిల్ గేట్స్ భారత దేశం లో ప్రముఖులు అందరిని కలుస్తూ వస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కూడా కలిశారు.  మన దేశ పర్యటనలో బిల్ గేట్స్ మన వంటలను రుచి చూస్తూ ఆస్వాదిస్తున్నారు

ప్రస్తుతం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి బిల్ గేట్స్ ఒకే బెంచ్ మీద కూర్చొని వడాపావ్ ని ఆస్వాదిస్తూ తింటున్నారు.  దీనికి సంబంధించిన వీడియో ను బిల్ గేట్స్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు

ఈ ఫోటో కి కాప్షన్ జత చేశారు. పనిలోకి వెళ్లే ముందు ఒక స్నాక్ బ్రేక్ అని రాసుకొచ్చారు.   అంతే కాకుండా ఈ వీడియో పై సెర్వింగ్ సూన్ అని రాశారు

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. క్రికెటర్లు యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ లు లైక్ చేశారు. ప్రపంచంలో అపార కుబేరుడైన బిల్ గేట్స్ భారత దేశం లో పర్యటించడం ఇది మూడవ సారి.  గతం లో కూడా ఒకసారి 2023 లో సచిన్ టెండూల్కర్, బిల్ గేట్స్ లు కలుసుకున్నారు 

సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే బిల్ గేట్స్ ఏవో కొత్త ఆలోచనలతోనే భారత దేశం వచ్చినట్లుంది

పెద్ద వాళ్ళు ఇలా తరచూ ఇతర దేశాల పర్యటనలు చేస్తూ అక్కడి పద్ధతులు, సమస్యలు, వాటిని పరిష్కరించుకున్న విధానాలను తెలుసుకుంటుంటారు. 

అయితే సచిన్ టెండూల్కర్, బిల్ గేట్స్ ఏదైనా ఫుడ్స్ అండ్ బెవరేజెస్ పరిశ్రమను స్థాపిస్తున్నారా అన్న ఆలోచనలు వస్తున్నాయి అందరికి