‘హరి హర వీరమల్లు’.. పవన్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌

by | Mar 21, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. కాగా, హరిహరవీరమల్లు మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా… చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో భాగంగా అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు.

తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ పనులు షూరూ అయ్యాయి. పూజా కార్యక్రమంతో చిత్రబృందం డబ్బింగ్‌ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ‘ద జర్నీ ఆఫ్ అన్ మ్యాచుడ్ హీరోయిజం’ అంటూ డబ్బింగ్‌ ప్రారంభించిన విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా మేకర్స్‌ ప్రకటించారు. కాగా, భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది. కాగా, మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.