3వ టి 20 లో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ ఘన విజయం

by | Mar 21, 2025 | వార్తలు

న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడవ టి 20 మ్యాచ్ లో పాకిస్థాన్ న్యూజిలాండ్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  ఎట్టకేలకు పాకిస్థాన్ గెలిచింది. ఆది కూడా 204 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్ల లో చేధించి మరి గెలిచింది

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 19.5 ఓవర్ల లో 204 పరుగుకులకు అల్ అవుట్ అయ్యింది

ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాసేపటికే ఓపెనర్ ఫిన్ అలెన్ డక్ అవుట్ అవడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడినట్లు అనిపించింది

మరో ఓపెనర్ సీఫెర్ట్ కూడా ధాటిగా ఆడి 9 బంతుల్లో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన మార్క్ చాప్ మన్  మరో వైపు ధాటిగా ఆడుతూ 44 బంతుల్లో 94 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  కెప్టెన్ బ్రాస్ వెల్ ధాటిగా ఆడి 18 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

పాకిస్థాన్ బౌలర్ల లో హరీష్ రౌఫ్ మూడు వికెట్లు తీయగా, షహీన్ షా ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ ఆఫ్రిది రెండేసి వికెట్లు తీశారు. షాదాబ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు

205 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ కు ఓపెనర్ లు మొహమ్మద్ హారిస్, హాసన్ నవాజ్ లు ధాటిగా ఆడుతూ మొదటి వికెట్ కు 74 పరుగులు జోడించారు

20 బంతుల్లో 41 పరుగులు చేసిన మొహమ్మద్ హరీశ్ డఫీ బౌలింగ్ లో అవుట్ అవడంతో కెప్టెన్ సల్మాన్ ఆఘా తో కలిసి హాసన్ నవాజ్ స్కోర్ బోర్డు ను పరిగెత్తించాడు.  వీరిద్దరూ రెండవ వికెట్ కు అజేయంగా  133 పరుగులు జోడించారు.

హాసన్ నవాజ్ సెంచరీ తో, కెప్టెన్ సల్మాన్ ఆఘా అర్ధ సెంచరీ తో చెలరేగిపోయారు. హాసన్ నవాజ్ 45 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ సల్మాన్ ఆఘా 31 బంతుల్లో 51 పరుగులు చేశాడు

హాసన్ నవాజ్, సల్మాన్ ఆఘా చెలరేగడంతో పాకిస్థాన్ కేవలం 16 ఓవర్ల లో 207 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది

హాసన్ నవాజ్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు