నందమూరి నటసింహం బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు (Akhanda) ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మురళీకృష్ణగా, అఖండ రుద్రసికిందర్ అఘోరాగా రెండు విభిన్నమైన పాత్రల్ని బాలయ్య పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుండడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బాలయ్యకు సెప్టెంబర్ నెల సెంటిమెంట్ గా కలిసి రావడమే ఇందుకు కారణం అని చెప్పొచ్చు. బాలయ్య నటించిన ‘శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ 1979 సెప్టెంబర్ 28న ‘ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే బాలయ్య (Balayya) మొదటి బ్లాక్ బస్టర్ ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబర్ 7న విడుదలై 560 రోజులు థియేటర్లలో ఆడడం విశేషం.
ఇక బాలయ్య నటించిన ‘కలియుగ కృష్ణుడు’ సినిమా కూడా 1986 సెప్టెంబర్ లో విడుదలైన సూపర్ హిట్ గా నిలచింది. అలాగే 1994లో సెప్టెంబర్ లో విడుదలైన ‘బొబ్బిలి సింహం’ బాలయ్యను హీరోగా నిలబెట్టింది. అనంతరం 1999 సెప్టెంబర్ లో రిలీజైన ‘క్రిష్ణబాబు’ మూవీ కూడా మంచి విజయాన్ని సాధించింది. అలాగే 2002 సెప్టెంబర్ లో విడుదలైన ‘చెన్నకేశవ రెడ్డి’ బాలయ్య కెరీర్ లో టర్నింగ్ పాయింట్ మూవీగా నిలిచింది. ఇక బాలకృష్ణకు (Bala Krishna) హ్యాట్రిక్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ-2’ సినిమా కూడా సెప్టెంబర్ లో విడుదల కానుండడంతో అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సంగీతం అందిస్తున్నారు.

