బాక్స్​ఫీస్ వద్ద ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ర్యాంపేజ్.. తొలి రోజు కలెక్షన్లు

by | Mar 29, 2025 | సినిమా

టాలీవుడ్ టాప్ మూవీ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో సినిమా వస్తుంది అనగానే ఆ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుంది అనే నమ్మకం సినీ ప్రియుల్లో నిండిపోయింది. దాంతో పాటుగా సూప‌ర్ హిట్ చిత్రం మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా రావడంతో ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాకి భీమ్స్ (Bheems) సిసిరోలియో, తమన్ సంగీతం అందించారు. ఉగాది కానుకగా ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాగా.. మొదటి షోతోనే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దింతో అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ‘మ్యాడ్‌’ మూవీ క్లోజింగ్‌ కలెక్షన్స్‌ ‘మ్యాడ్‌ స్క్వేర్‌’కి మాత్రం మొదటి రోజే వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇటు ఇండియన్ బాక్సాఫీస్​తో పాటు, అటు ఓవర్సీస్​లోనూ కలెక్షన్లలో ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఈ క్రమంలోనే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కళ్లు చెదిరే ఓపెనింగ్స్ సాధించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే..

◆ నైజాం – 2.35 కోట్లు
◆ సీడెడ్ – 0.74 కోట్లు
◆ ఉత్తరాంధ్ర – 0.62 కోట్లు
◆ గుంటూరు – 0.51 కోట్లు
◆ నెల్లూరు – 0.19 కోట్లు
◆ తూర్పు గోదావరి – 0.37 కోట్లు
◆ పశ్చిమ గోదావరి – 0.21 కోట్లు
◆ కృష్ణ – 0.28 కోట్లు

‘మ్యాడ్ స్క్వేర్'(Mad Sqaure) మూవీ మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు బాక్సఫీస్ వద్ద రూ. 5.27 కోట్లు షేర్ వసూళ్లు సాధించడం విశేషం. ఇక దేశవ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా రూ.7.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఒక ఈ సినిమా ఓవర్సీస్​లోను అడరాహుడుతోంది.ఈ క్రమంలోనే మ్యాడ్ స్క్వేర్ తొలిరోజే ఓవర్సీస్​లో ఉహించని కలెక్షన్లు సాధించింది. మొదటి రోజు ఏకంగా 650k డాలర్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.