గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఇటీవలే చిత్ర బృందం మెగా అభిమానులకు అదిరిపోయే కానుక అందించింది. మార్చి 27న హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘ఆర్సీ 16’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘పెద్ది’ (Peddi) అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే రామ్ చరణ్ (Ram Charan) ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. లాంగ్ హెయిర్ స్టెల్‌తో.. రగ్గ్‌డ్ గడ్డంతో, ముక్కుకు రింగుతో సిగరెట్ వెలిగిస్తూ.. డాషింగ్ లుక్‌లో రామ్‌చరణ్ కనిపిస్తుంటే.. మరో పోస్టర్ లో ఫ్లడ్ లైట్ల వెలుగులో క్రికెట్ బ్యాట్ పట్టుకుని సీరియస్ లుక్ లో రామ్‌చరణ్ కనిపించారు. ఈ పోస్టర్స్ చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు చిత్ర బృందం అభిమానులకు మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రామ్ చరణ్ పుట్టినరోజు నాడే ఈ మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ అవాల్సి ఉంది. కానీ ఎఆర్ రెహమాన్ అందిస్తున్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పూర్తవకపోవడంతో ఈ గ్లింప్స్ ఆలస్యం అయ్యింది. ఈ క్రమంలోనే ‘పెద్ది’ మూవీ గ్లింప్స్ ఈ ఉగాది కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.
కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్ (Ram Charan) ఆట కూలీగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కథ రీత్యా రామ్‌చరణ్ అన్ని ఆటల్లో ఆరితేరి ఉంటాడట. అందుకే క్రికెట్, కుస్తీ, కబడ్డీ ఇలా ఆట ఏదైనా డబ్బులిస్తే ఆయా జట్ల తరపున బరిలోకి దిగుతాడాని తెలుస్తోంది. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

