ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది
239 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ కు, ఓపెనర్ డికాక్ 15 పరుగులకే అవుట్ అయినా, అదిరే ఆరంభం లభించింది. మరో ఓపెనర్ సునీల్ నరైన్ తో కలిసి కెప్టెన్ రహానే 54 పరుగులు జోడించారు
సునీల్ నరైన్ 13 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయిన తరవాత వచ్చిన వెంకటేష్ అయ్యర్, రహానె లు చెలరేగి పోయారు. మూడవ వికెట్ కు వీరిద్దరూ ధాటిగా ఆడుతూ 71 పరుగులు జోడించారు
అయితే 35 బంతుల్లో 61 పరుగులు చేసిన రహానే అవుట్ అయ్యాక తరవాత వచ్చిన రమణ్ దీప్ సింగ్, రఘువంశీ, రస్సెల్ లు వెంట వెంటనే అవుట్ అవడంతో కోల్ కతా నైట్ రైడర్స్ కు కష్టాలు వచ్చి పడ్డాయి. మరో పక్క 29 బంతుల్లో 45 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ కూడా అవుట్ అవడంతో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లోకి వెళ్ళింది.
అయితే చివర్లో రింకు సింగ్ ధాటిగా ఆడుతూ బంతుల్లో పరుగులు చేసి ఆశలు రేకెత్తించాడు. అయితే ఆఖరి ఓవర్లో 24 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే ఆ ఓవర్ లో 19 పరుగులు మాత్రమే వచ్చాయి. దానితో లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. హర్షిత్ రానా 20 ఓవర్ రెండో బంతికి పరుగులు ఏమి చేయకపోవడంతో ఒత్తిడి పెరిగింది
ఒకానొక దశలో కోల్ కతా నైట్ రైడర్స్ 13 ఓవర్ల కు జట్టు స్కోర్ 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తరవాతి 7 ఓవర్ల లో చేయాల్సింది 77 పరుగులు. అయితే చివరి 7 ఓవర్ల లో నాలుగు వికెట్లో కోల్పోయి 72 పరుగులు చేసింది
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల లో ఆకాష్ దీప్, శార్దూల ఠాకూర్ లు రెండేసి వికెట్ లు తీయగా, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠీ లు తలా ఒక వికెట్ తీశారు
అంతకు ముందు టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్ల లో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్క్రమ్ లు మొదటి వికెట్ కు 99 పరుగులు జోడించారు
మార్క్రమ్ 28 బంతుల్లో 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ తరవాత వచ్చిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ని ఊచకోత కోశాడు. మరోవైపు మార్ష్ కూడా ఎక్కడ తగ్గలేదు. వీరిద్దరూ రెండవ వికెట్ కు 71 పరుగులు జోడించారు
48 బంతుల్లో 5సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో, 81 పరుగులు చేసిన మార్ష్ అవుట్ అయ్యాడు.
ఆ తరవాత వచ్చిన అబ్దుల్ సమద్ తో జత కలిసిన పూరన్ మూడవ వికెట్ కు 51 పరుగులు జోడించారు. ఇందులో అబ్దుల్ సమద్ చేసిన పరుగులు 6.
నికోలస్ పూరన్ చివర వరకు నిలబడి 36 బంతుల్లో 8 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు
కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రానా రెండు వికెట్లు, రస్సెల్ ఒక వికెట్ తీశారు

