ఆర్య విధ్వంసం ; పంజాబ్ కింగ్స్ 219 పరుగుల భారీ స్కోర్

by | Apr 8, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది.

ప్రభు సిమ్రాన్ సింగ్ డక్ అవుట్ కాగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 9 పరుగులు, స్టయినిస్ 4 పరుగులు, వధేరా 9 పరుగులు, మాక్స్ వెల్ 1 పరుగు చేసి వెంట వెంటనే అవుట్ అయ్యారు. అయితే ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య మాత్రం ధాటిగా ఆడుతూనే, నిలకడైన ఆటను ప్రదర్శించాడు.  వికెట్లు పడుతున్న రన్ రేట్ మాత్రం 10 పరుగులు తగ్గకుండా ఉంది

 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో, శశాంక్ సింగ్, ప్రియాంశ్ ఆర్య  లు ఆరవ వికెట్ కు 71 పరుగులు జోడించాక, ఓపెనర్  ప్రియాంశ్ ఆర్య 42 బంతుల్లో, 9 సిక్సర్లు, 7 ఫోన్ల సాయంతో 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆ తరవాత వచ్చిన జాన్సెన్ తో శశాంక్ సింగ్ ఏడవ వికెట్ కు అజేయంగా 65 పరుగులు జోడించారు. శశాంక్ సింగ్ 36 బంతుల్లో 52 పరుగులు, జాన్సెన్ 19 బంతుల్లో 34 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచారు

చివరకు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల లో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ లు రెండేసి వికెట్ లు తీశారు.  ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ లు చెరో ఒక వికెట్ తీశారు.  అశ్విన్ ఒకే ఓవర్ లో వధేరా, మాక్స్ వెల్ లను అవుట్ చేశాడు