ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది
220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఓపెనర్లు రచిన్ రవీంద్ర, కాన్వే లు మొదటి వికెట్ కు 61 పరుగు జోడించి మంచి శుభారంభాన్నిచ్చారు
అయితే 36 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర, కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ లు వెంట వెంటనే అవుట్ అవడంతో చెన్నై సూపర్ కింగ్స్ తడబాటుకు గురయ్యింది. ఆ తరవాత వచ్చిన శివమ్ దూబే, కాన్వే తో కలిసి మూడవ వికెట్ కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు
27 బంతుల్లో 42 పరుగులు చేసిన శివమ్ దూబే అవుట్ అవడం, కొద్దిసేపటికే 49 బంతుల్లో 69 పరుగులు చేసిన కాన్వే రిటైర్డ్ అవుట్ అవడంతో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది
బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం ముందు వచ్చిన ధోని ధాటిగా ఆడుతూ 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అయితే అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. 20 వ ఓవర్ మొదటి బంతికి ధోని అవుట్ అయ్యాక పూర్తిగా మ్యాచ్ పంజాబ్ కింగ్స్ చేతుల్లోకి వచ్చేసింది
చివరకు చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి, విజయానికి 18 పరుగుల దూరం లో నిలిచిపోయింది
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో ఫెర్గుసన్ రెండు కీలక వికెట్లు తీయగా, యష్ ఠాకూర్, మాక్స్ వెల్ లు చెరో ఒక వికెట్ తీశారు
విధ్వంసకర సెంచరీ చేసిన ప్రియాంశ్ ఆర్య ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది
అంతకు ముందు టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది.
ప్రభు సిమ్రాన్ సింగ్ డక్ అవుట్ కాగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 9 పరుగులు, స్టయినిస్ 4 పరుగులు, వధేరా 9 పరుగులు, మాక్స్ వెల్ 1 పరుగు చేసి వెంట వెంటనే అవుట్ అయ్యారు. అయితే ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య మాత్రం ధాటిగా ఆడుతూనే, నిలకడైన ఆటను ప్రదర్శించాడు. వికెట్లు పడుతున్న రన్ రేట్ మాత్రం 10 పరుగులు తగ్గకుండా ఉంది
83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో, శశాంక్ సింగ్, ప్రియాంశ్ ఆర్య లు ఆరవ వికెట్ కు 71 పరుగులు జోడించాక, ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 42 బంతుల్లో, 9 సిక్సర్లు, 7 ఫోన్ల సాయంతో 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఆ తరవాత వచ్చిన జాన్సెన్ తో శశాంక్ సింగ్ ఏడవ వికెట్ కు అజేయంగా 65 పరుగులు జోడించారు. శశాంక్ సింగ్ 36 బంతుల్లో 52 పరుగులు, జాన్సెన్ 19 బంతుల్లో 34 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచారు
చివరకు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల లో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ లు రెండేసి వికెట్ లు తీశారు. ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ లు చెరో ఒక వికెట్ తీశారు. అశ్విన్ ఒకే ఓవర్ లో వధేరా, మాక్స్ వెల్ లను అవుట్ చేశాడు

