అదిరిపోయేలా అఖిల్ ‘లెనిన్’ గ్లింప్స్‌

by | Apr 8, 2025 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌‌ హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్‌ కిరణ్‌ మురళీకిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. గ్రామీణ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొంద‌నుంద‌ని స‌మాచారం. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర బృందం అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి విషెస్‌ చెప్పింది. మొదటి నుంచి ప్రచారంలో ఉన్నట్టే ఈ సినిమాకు ‘లెనిన్’ (Lenin) అనే టైటిల్‌ ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో “మా నాయన నాకో మాట సెప్పినాడు పుట్టేటపుడు ఊపిరి ఉంటాది రా పేరుండదు..” అంటూ అఖిల్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ అభిమానులు ఈలలు వేసేలా ఉంది.

ఈ గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ యాక్షన్‌ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెండేళ్ల విరామం తర్వాత అఖిల్ (Akhil) కొత్త సినిమా ప్రకటన రావడంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రాయలసీమ నేపథ్యంలో పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అధికభాగం చిత్తూరు జిల్లాలో షూటింగ్‌ చేస్తారట. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studio), సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.