లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం

by | Apr 12, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా  గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది  

181 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు మార్క్రమ్, కెప్టెన్ రిషబ్ పంత్ లు మొదటి వికెట్ కు 65 పరుగులు జోడించి చక్కని శుభారంభాన్నిచ్చారు

21 పరుగులు చేసిన  రిషబ్ పంత్ అవుట్ అయిన తరవాత వచ్చిన నికోలస్ పూరన్, మార్క్రమ్ లు కలిసి రెండవ వికెట్ కు 58 పరుగులు జోడించారు. మార్క్రమ్ 31 బంతుల్లో 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తరవాత జట్టు స్కోర్ కు మరో 32 పరుగులు జోడించిన తరవాత, 34 బంతుల్లో 61 పరుగులు చేసిన నికోలస్ పూరన్, జట్టు స్కోర్ 155 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు

డేవిడ్ మిల్లర్ కూడా  ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేదు. 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లో 6 బంతులకు 6 పరుగులు చేయాల్సి వచ్చింది

అబ్దుల్ సమద్ ఒక పరుగు తీసి బదోని కి స్ట్రైక్ ఇవ్వగా, తరవాతి రెండు బంతులలో  బదోని ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టి లక్నో సూపర్ జెయింట్స్ ని గెలిపించాడు

బదోని 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో, నాలుగు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి, ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది 

గుజరాత్ టైటాన్స్ బౌలర్ల లో ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు తీయగా,  రషీద్ ఖాన్, సుందర్ లు చెరో ఒక వికెట్ తీశారు

అంతకు ముందు టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది

లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్ లు సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ లు మొదటి వికెట్ కు 120 పరుగులు జోడించారు. అయితే 38 బంతుల్లో 60 పరుగులు చేసి న శుభ్ మన్ గిల్,  37 బంతుల్లో 56 పరుగులు చేసి న సాయి సుదర్శన్ ఇద్దరు వెంట వెంటనే అవుట్ అయ్యారు.

జట్టు  చేసిన 180 పరుగులలో, సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ లు చేసిన పరుగులు 116.  ఎక్స్ట్రా ల రూపంలో మరో తొమ్మిది పరుగులు వచ్చాయి.

ఆ తరవాత వచ్చిన ఆటగాళ్లు ఎవరు క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. బట్లర్ 16 పరుగులు , సుందర్ రెండు పరుగులు, రూథర్ ఫోర్డ్ 22 పరుగులు, చేసి అవుట్ అవగా, రాహుల్ తేవాతియ డక్ అవుట్ అయ్యాడు. షారుఖ్ ఖాన్ 11 పరుగులు రషీద్ ఖాన్ నాలుగు పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచారు

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ లు రెండేసి వికెట్ లు తీయగా, దిగవేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ లు చెరో ఒక వికెట్ తీశారు