లక్నో సూపర్ జెయింట్స్ విజయ లక్ష్యం 181 పరుగులు

by | Apr 12, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా  గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది

లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్ లు సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ లు మొదటి వికెట్ కు 120 పరుగులు జోడించారు. అయితే 38 బంతుల్లో 60 పరుగులు చేసి న శుభ్ మన్ గిల్,  37 బంతుల్లో 56 పరుగులు చేసి న సాయి సుదర్శన్ ఇద్దరు వెంట వెంటనే అవుట్ అయ్యారు.

జట్టు  చేసిన 180 పరుగులలో, సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ లు చేసిన పరుగులు 116.  ఎక్స్ట్రా ల రూపంలో మరో తొమ్మిది పరుగులు వచ్చాయి.

ఆ తరవాత వచ్చిన ఆటగాళ్లు ఎవరు క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. బట్లర్ 16 పరుగులు , సుందర్ రెండు పరుగులు, రూథర్ ఫోర్డ్ 22 పరుగులు, చేసి అవుట్ అవగా, రాహుల్ తేవాతియ డక్ అవుట్ అయ్యాడు. షారుఖ్ ఖాన్ 11 పరుగులు రషీద్ ఖాన్ నాలుగు పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచారు

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ లు రెండేసి వికెట్ లు తీయగా, దిగవేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ లు చెరో ఒక వికెట్ తీశారు