20 కోట్లు దాటిన జియో హాట్ స్టార్ సబ్ స్క్రైబర్స్ ; వరల్డ్ నెంబర్ 3

by | Apr 12, 2025 | టీవీ & ఓటిటి

జియో హాట్ స్టార్ 20 కోట్ల సబ్ స్క్రైబర్స్ మైలు రాయిని దాటింది.

జియో హాట్ స్టార్  అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ ల భాగస్వామి కంపెనీ. ఈ కంపెనీ చైర్మన్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ.  ఈ కంపెనీ వైస్ చైర్మన్ ఉదయ్ శంకర్. ఒక ఇంటర్వ్యూ లో ఉదయ్ శంకర్ జియో హాట్ స్టార్ 20 కోట్ల  సబ్ స్క్రైబర్స్ మైలురాయింది దాటిందని చెప్పారు. 

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మన దేశంలో అనేక ప్రాంతీయ భాషలలో ప్రసారమవుతోంది.  ప్రస్తుత సబ్ స్క్రైబర్స్ పెరగడానికి ఐపీల్ కూడా ఒక కారణం కావచ్చు. దీనితో జియో హాట్ స్టార్, ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ గా అవతరించిందని చెప్పుకొచ్చారు

మొదటి స్థానంలో నెట్ ఫ్లిక్స్ ఉండగా, రెండవ స్థానంలో అమెజాన్ ప్రైమ్ ఉంది.

అయితే ఈ మూడు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ల మధ్య తీవ్రమైన పోటీ ఇది. నెట్ ఫ్లిక్స్ పూర్తి ఇండియన్ కంటెంట్, మూవీస్ ఆడియన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అమెజాన్ కంటెంట్ కు సంబంధించి ఇతర ఒప్పందాలను కుదుర్చుకుంది.

రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్ చందాదారులు ఉచితంగా ఐపీల్ స్ట్రీమింగ్ చూడవచ్చు