పవర్‌ఫుల్‌గా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్!

by | Apr 12, 2025 | సినిమా

మాస్, కామెడీ, యాక్షన్ జాన‌ర్‌ల‌తో పాటు విభిన్న సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టులలో టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ ఒక‌రు. ఇప్పుడు ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో వ‌స్తున్న ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాను స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 18న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ మూవీ విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్.

ఈ ట్రైలర్ లో విజయశాంతి (Vijaya Shanti) వైజయంతి అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించగా.. ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. ట్రైలర్ లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలివేట్ అయ్యేలా వదిలారు. ఇందులో కళ్యాణ్ రామ్ (Kalyan Ram), విజయశాంతి చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, గొడవ, భావోద్వేగాలు, అనుబంధాల నేపథ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు ట్రైలర్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఏది ఏమైన ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచ‌నాలు పెంచేసింది. మీరు ఈ పవర్ ఫుల్ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

కాగా, ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ (NTR) ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.