ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ పై కన్నేసి ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ లు మొదటి వికెట్ కు 4 ఓవర్ల లో 66 పరుగులు చేసి సూపర్ శుభారంభాన్నిచ్చారు
13 బంతుల్లో 36 పరుగులు చేసిన ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిన తరవాత వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 23 బంతుల్లో 42 పరుగులు చేసిన ప్రభు సిమ్రాన్ సింగ్ అవుట్ అయిన తరవాత వధేరా, శ్రేయాస్ అయ్యర్ తో కలిసి మూడవ వికెట్ కు 73 పరుగులు జోడించారు
27 పరుగులు చేసిన నేహాల్ వధేరా అవుట్ అయిన తరవాత పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ కొంత తడబాటుకు గురయ్యింది. శశాంక్ సింగ్, మాక్స్ వెల్ లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఆ తరవాత కొద్దీ సేపటికి, జట్టు స్కోర్ 206 పరుగుల వద్ద, 36 బంతుల్లో 82 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా అవుట్ అయ్యాడు
చివర్లో స్టయినిస్ ధాటిగా ఆడడంతో పంజాబ్ కింగ్స్ చివరి 2.3 ఓవర్ల లో 39 పరుగులు చేసింది. స్టయినిస్ 11 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరకు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది
సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా, ఇషాన్ మలింగా రెండు వికెట్ లు తీశాడు
వరస పరాజయాలతో డీలా పడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంత స్కోర్ ఛేదించగలదా లేదా చేతులెత్తేస్తుందా అనేది చూడాలి

