కేతిక శర్మ ‘అదిదా సర్ప్రైస్’ వీడియో సాంగ్ విడుదల

by | Apr 7, 2025 | సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల జంటగా యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ‘రాబిన్‌హుడ్‌’

ఇప్పుడు ఈ సినిమా నుండి కేతిక శర్మ నటించిన ‘అదిదా సర్ప్రైస్’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.  ఈ పాటను సోనీ మ్యూజిక్ వారు విడుదల చేశారు.  ఈ పాట అనేక వివాదాలకు దారి తీసింది

ఈ సినిమాను  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించగా.. నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు.  ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా ఉగాది పండుగ కానుకగా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్​గా విడుదలైంది. అయితే ఈ సినిమాకు తొలి రోజు నుంచే బాక్సఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది.