‘కల్కి-2’ షూటింగ్ అప్‌డేట్.. అంచనాలు పీక్స్‌లో!

by | Jan 28, 2026 | సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’ మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 9న విడుదలైంది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్ వచ్చినప్పటికీ రాజాసాబ్ కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. ‘ది రాజా సాబ్’తో థియేటర్లలో ఉండగానే ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ (Fouji) మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ (Spirit) కూడా ప్రారంభమైంది. ఈ రెండు సినిమాలు చేస్తూనే ప్రభాస్ ‘ కల్కి 2 ’కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

తాజా సమాచారం ప్రకారం ‘కల్కి 2’ (Kalki) మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 2 నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ (Prabahs) తో పాటుగా ఇతర తారగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ ‘కల్కి-2’ చిత్రీకరణలో పాల్గొననున్నాడు అనే విషయం తెలియగానే ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. మహాభారత ఇతివృత్తాన్ని సైన్స్ ఫిక్షన్‌తో కలిపి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ భైరవగా, కర్ణగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఇదిలావుంటే.. ‘కల్కి’ తొలిభాగంలో నటించిన దీపికా పడుకోన్‌ను ‘కల్కి2’ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్ అన్వేషణలో ఉన్న మేకర్స్ సాయిపల్లవిని (Sai Pallavi) ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ విషయంలో సాయిపల్లవి తన సమ్మతిని తెలియజేసిందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ఈ వార్తలో వాస్తవమెంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేంతవరకు వేచిచూడాల్సిందే.