‘శప్తభూమి’ న‌వ‌ల ఆధారంగానే ‘రణబాలి’ సినిమా.!

by | Jan 28, 2026 | సినిమా

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijaya Devara Konda) కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న‌ ‘రణబాలి’ (Ranabaali) టైటిల్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. గణతంత్ర దినోత్సవ కానుకగా విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గ్లింప్స్‌లో ‘రణబాలి’ అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించగా.. కథానాయిక రష్మిక మందన్న (Rashmika Mandana) జయమ్మగా కనిపించారు. ప్రతినాయకుడు సర్ థియోడోర్ హెక్టార్ పాత్రలో ఆర్నార్డ్ వోస్లూ నటిస్తున్నాడు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ‘రణబాలి’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ న‌వ‌ల ‘శప్తభూమి’ (Shapta Bhoomi) ఆధారంగా ఈ సినిమా చేయ‌బోతున్నారానే వార్త టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ప్రముఖ రచయిత బండి నారాయణస్వామి రాసిన ‘శప్తభూమి’ నవల మాదిరిగానే ఈ సినిమా కథ ఉందని కొందరు అంటున్నారు. ఈ నవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకోవడమే కాకుండా.. 2017లో తానా నిర్వహించిన నవలల పోటీల్లో కూడా బహుమతిని సాధించింది. 18వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలో ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది బండి నారాయణస్వామి ఈ నవలలో వివరించారు. ‘రణబాలి’ (Ranabaali) టీజర్ (Teaser) లో కూడా ఆనాడు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చూపించారు. మొత్తానికి ఈ క్రేజీ అప్‌డేట్ తో సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో బిగ్గెస్ట్ రాబోతుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. మ‌రి దీనిపై క్లారిటీ రావాలంటే కొంత‌కాలం వెయిట్ చేయాల్సిందేనంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా, ఈ చిత్రాన్ని టీ సీరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.