తెలుగు చిత్ర పరిశ్రమలో గతేడాది టిల్లు స్క్వేర్‌తో అభిమానులను మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాక్’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేయగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, హీరో సిద్దూ జొన్నలగడ్డ మధ్య గొడవలున్నాయి అని వస్తున్న వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దూ జొన్నలగడ్డ స్పందించారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌కు తనకు మధ్య గొడవలు లేవని కేవలం చిన్న మనస్పర్థలు మాత్రమే వచ్చాయని అవి కూడా సినిమా నుండి మంచి అవుట్ ఫుట్ తీసుకొచ్చేందుకే అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే సిద్థూ జొన్నలగడ్డ మాట్లాడుతూ..’ నాకు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌కు (Bommarillu Bhaskar) మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చింది నిజమే. మేము జాక్ సినిమా కోసమే చర్చించుకున్నాం. సినిమా అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజమే. అంతేకానీ, మేము వ్యక్తిగత కారణాల వల్ల గోడవపడలేదు. సోషల్‌మీడియాలో పెట్టే ఒక చిన్న పోస్ట్ వల్లే స్నేహితులు విడిపోతున్నారు. అలాంటిది ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇలాంటివి జరగడంతో తప్పేం లేదు. సినిమా అవుట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వొద్దు ’’ అని సిద్దూ జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు. కాగా, జాక్ (Jack) సినిమా కోసం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఓ డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ జాక్ అనే ప్రయివేట్ స్పై ఏజెంట్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధూ సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ యుత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ జాక్ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు.

