టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఏప్రిల్ 18 న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం విడుదలవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఇది ఒక ఎమోషనల్ ఫిలిం అని కళ్యాణ్ రామ్ అన్నారు. చివరి 20 నిముషాలు, మన ఇండస్ట్రీ లో ఇలాంటి క్లైమాక్స్ రాలేదు. తల్లి మీద ప్రేమ ఉన్న ప్రతి కొడుకు, కూతురు ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే కళ్ళలోంచి నీళ్లు వస్తాయి అని అన్నారు.
ఈ ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి ఉండడం ఒక హైలైట్. వీళ్ళ సినిమాలో మీరెందుకు వచ్చారని సుమ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అనిల్ రావిపూడి కి ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది ఎవరు కళ్యాణ్ రామ్ గారు, లెజెండరీ యాక్ట్రెస్ విజయ శాంతి గారికి ఇండస్ట్రీ లో రీ ఎంట్రీ ఇచ్చింది ఎవరు అనిల్ రావిపూడి. అటువంటప్పుడు వీళ్లిద్దరు సినిమా చేస్తుంటే నేను ఉండాలి కదా అనిల్ రావిపూడి అన్నారు
యాంకర్ సుమ చేసిన ఈ ఇంటర్వ్యూ లో కళ్యాణ్ రామ్, విజయ శాంతి గారు, అనిల్ రావిపూడి గారు ఉన్న ముగ్గురు ఉన్నారు.

