దోనేపూడి చక్రపాణి సమర్పణలో, చిత్రాలయం స్టూడియో అధినేత వేణు దోనేపూడి ఒక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాలూకు టైటిల్ తో, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి రామం – ది రైజ్ అఫ్ అకీరా అని టైటిల్ పెట్టారు
ఈ చిత్రంలో నటీనటుల వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే ఒక యువ నటుడు ఇందులో నటిస్తారని తెలుస్తోంది
ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు చెప్పని ఒక గొప్ప యోధుడి గురించి ఈ సినిమా అని తెలుస్తోంది. ఈ చిత్రం తో లోకమాన్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు
శ్రీరామ నవమి శుభాకాంక్షలతో చిత్రాలయం సినిమాటిక్ యూనివర్స్ ఈ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది.

