భారత, ఐర్లాండ్ మహిళా జట్ల మద్య జరుగుతోన్న మూడవ వన్డేలో భారత మహిళల జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయియింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోర్ చేసింది
ఓపెనర్లు ప్రతీక రావల్, స్మ్రితి మందాన మొదటి వికెట్ కు 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు
ప్రతీక రావల్ 129 బంతుల్లో 154 పరుగులు చేసింది. ఇందులో 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కెప్టెన్ స్మ్రితి మందన కేవలం 80 బంతుల్లో 135 పరుగులు చేసింది. ఇందులో 7 సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. రిచా ఘోష్ ధాటిగా ఆది 42 బంతుల్లో 59 పరుగులు చేసింది
అనంతరం 436 పరుగుల విజయ లక్ష్యం బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు కడపటి వార్తలందేసరికి 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.
భారత క్రికెట్ చరిత్రలో ఇదొక సరికొత్త రికార్డు. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలు 435 పరుగులు ఒక రికార్డు. టీం ఇండియా (పురుషుల జట్టు) అత్యధిక స్కోర్ 418

