గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా కు మొదటి నుంచి అన్ని కష్టాలే. సాధారణం గా అన్ని సినిమా కష్టాలు అంటూ ఉంటారు. అయితే సినిమాకే సినిమా కష్ఠాలు మాత్రం గేమ్ చేంజర్ సినిమాకు మాత్రమే
గేమ్ చేంజర్ సినిమా జీ స్టూడియో తో 2020-21లో ప్రారంభమవ్వాలి. అయితే కొంత కోవిడ్ సమస్యలు, మరి కొన్ని జీ స్టూడియో తో నిర్మాత కు బడ్జెట్ కు సంబంధించిన సమస్యలు. వీటన్నింటికి మించి శంకర్ రెండు పడవల ప్రయాణం
ఈ సినిమా అనుకుని స్టార్ట్ చేశాక, దర్శకుడు శంకర్, భారతీయుడు-2 షూట్ మొదలు పెట్టాడు. కొన్ని రోజులు భారతీయుడు, మధ్య, మధ్యలో గేమ్ చేంజర్ ని షూట్ చేశాడు.
అసలే తెలుగులో శంకర్ కు ఇది మొదటి సినిమా. ఎంతో జాగ్రత్తగా తీయాల్సిన శంకర్ రెండు పడవల ప్రయాణం (భారతీయుడు-2 మరియు గేమ్ చేంజర్) బెడిసి కొట్టింది. భారతీయుడు-2, సినిమాలో కూడా కొంత పొలిటికల్ ఫ్లేవర్ ఉంటుంది. ఈ రెండు సినిమాల కు స్క్రీన్ ప్లే గందరగోళం ఉండవచ్చు. అంతే కాదండోయ్ దర్శకుడు శంకర్, మధ్యలో భారతీయుడు-3 ని కూడా తెర మీదకు తెచ్చే పనిలో పడ్డారు
2021 నుండి, అంటే సుమారుగా, నాలుగేళ్లపాటు గేమ్ చేంజర్ సినిమా మీద పని చేసిన శంకర్ చేసిన పొరపాట్లు ఏంటో తెలుసా
కార్తీక్ సుబ్బరాజు, చెప్పిన ఒక చిన్న లైన్ ను సినిమాగా డెవలప్ చేసుకుంది షూట్ కి వెళ్లాలని శంకర్ కు తెలియలేదా. అనుభవజ్ఞుడైన శంకర్ షూట్ కి బౌండెడ్ స్క్రిప్ట్ తో వెళ్లలేదా, లేదా మారుతున్న ఆడియన్స్ అభిరుచులను అందుకోవడంలో విఫలమయ్యాడా..?
ఎందుకంటె శంకర్ గత మూడ్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విమర్శల పాలైన సంగతి మరచిపోకూడదు ( ఐ, స్నేహితుడు, 2. ). 2015 తరవాత వచ్చిన ఈ మూడు సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఇప్పుడు 2025 లో ఉన్నాము. శంకర్ తన గత చిత్రాల వైఫల్యాల నుండి నేర్చుకోలేదా.
ఇన్ని సంవత్సరాలపాటు సినిమా తీసున్నప్పుడు, దిల్ రాజు మౌనం ఎందుకు వహించాడు. బడ్జెట్ పరిమితులు దాటుతున్నపుడు ఎందుకు హెచ్చరించలేదు. గతం లో ఎంతో మంది పెద్ద హీరోల సినిమాల సినిమా మధ్యలోనే ఆగిపోయాయి (చిరంజీవి సినిమాతో సహా). సినిమా జయాపజయాలను సినిమా బడ్జెట్ కూడా నిర్ణయించే ఈ రోజుల్లో దిల్ రాజు మౌనం ఈ సినిమాకు శాపం
పాటలకు అన్ని కోట్లు అవసరమా దిల్ రాజు, శంకర్ గారు. నాలుగేళ్లపాటు తీయాల్సిన సినిమానా, ఒక సినిమా చేస్తూ, మధ్యలో భారతీయుడు-2, 3 అని శంకర్ ఎలా అంటాడు. దిల్ రాజు ఎలా ఒప్పుకున్నాడు. వీళ్లిద్దరు కూర్చుని, ఆలోచించాల్సిన అవసరం ఉంది.
జీ స్టూడియో తో కొలాబరేషన్ కూడా దెబ్బ కొట్టిందా. మార్కెట్, ఇండస్ట్రీ సెంటిమెంట్ ప్రకారం భారీ చిత్రాలు ఏమి జీ తెలుగు ఛానల్ వారికి కలసి రావు
అంతెందుకు. ఈ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రెండు దిల్ రాజు వే, జీ తెలుగు వే. ఈ రెండు చిత్రాలు ఏమంత గొప్పగా లేవు. గతం లో ఎఫ్ 3 కూడా జీ తెలుగు వారు కొన్నారు. అయితే సూపర్ హిట్ అయినా ఎఫ్ 2 మాత్రం స్టార్ మా వారిది
అన్ని కష్టాలు దాటి డిసెంబర్ రిలీజ్ అన్నారు. ఆ తరవాత సంక్రాంతి కి మార్చారు. (విశ్వంభర ని పోస్ట్ పోనే చేశారు)
డిసెంబర్ లో అసలు సినిమా రిలీజ్ లు పెద్దగా లేవు. అప్పుడు రిలీజ్ చేసినప్పుడు పోటీ ఉండేది కాదు. అంతే కాకుండా, సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచుకునే అవకాశం ఉండేది (పుష్ప-2 సినిమా కు సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచారు)
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ప్రెస్ మీట్ లో దిల్ రాజు, శంకర్ (చిరంజీవి తో కూడా చెప్పించారు) చేసిన ఓవర్ హైప్ కూడా అంత ఇంత కాదు.
సినిమా రిలీజ్ దగ్గర పడిన తరవాత కొండ దేవర, అరుగు మీద పాటలు విడుదల చేయడం కూడా మైనస్ పాయింట్
అంతే కాకుండా, అల్లు అర్జున్ చేసిన పనికి, సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి వీలు లేకుండా పోయింది. పెంచి టికెట్ రేట్లను, అదనపు షోలను హై కోర్ట్ ఆదేశాలతో, రాష్ట్ర ప్రభుత్వ హోమ్ శాఖ రద్దు చేసింది.
పొలిటికల్ కంటెంట్ తో సంక్రాంతి కి రావడం మరో మైనస్ పాయింట్. కుటుంబ ప్రేక్షకులు థియేటర్ కు వచ్చే ఈ సీజన్ లో, అది పోటీ ఎక్కువగా ఉన్నా టైం లో (డాకు మహారాజ్, సంక్రాంతి కి వస్తున్నాం) విడుదల చేయడం మరో మైనస్ పాయింట్. టికెట్ రేట్లు పెంచుకునే వీలు లేకపోవడం, థియేటర్ లు మరో రెండు సినిమాలతో షేర్ చేసుకోవడం (మూడు సినిమాలు దిల్ రాజువే – నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా)
ఇక్కడి తో ఆగకుండా, ఈ సినిమా మీద, కొందరు పని కట్టుకుని దుష్ప్రచారం చేయడం, సోషల్ మీడియా లో నెగటివిటీ ని వ్యాప్తి చేయడం, కావలసినంత డబ్బు ఇవ్వకపోతే ఈ సినిమాని లీక్ చేస్తానని కొందరు బెదిరించడం (ఎవరో తేలాలి). కీలక సన్నివేశాలను సోషల్ మీడియా లో లీక్ చేయడం, ఆన్ లైన్ లో షేర్ చేయడం, అంతే కాకుండా ఈ రోజు ఒక లోకల్ ఛానల్ లో ఈ సినిమాని ప్రసారం చేయడం (దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఒక నెటిజెన్ షేర్ చేసాడట) వంటి అనేక ప్రతికూల పరిస్థితులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చెంజర్’ ని వెంటాడాయి
ఈ సినిమా ఫెయిల్యూర్ వెనక A1 నుండి A10 వరకు శంకర్ అయితే, A11 గా దిల్ రాజు, ఆ తర్వాత సోషల్ మీడియా అని. చెప్పవచ్చు.
కొంచెం ఏమైనా చెప్పుకోవచ్చు అంటే, రామ్ చరణ్ నటుడిగా మరో మెట్టు ఎదిగాడని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా అప్పన్న పాత్రలో, కలెక్టర్ పాత్రలో రామ్ చరణ్ చూపిన వేరియేషన్స్ కు, రామ్ చరణ్ ని అభినందించవచ్చు

