భారతీయులను డాక్యుమెంట్ లు సరిగా లేకుండా అమెరికా పంపించిన ఏజెంట్ ల పై, కన్సల్టెన్సీ ల పై కఠిన చర్యలు ఉంటాయా.
ట్రంప్ మనకు మంచే చేశాడా….? మన వ్యవస్థలో లోపాలను మనకు గుర్తు చేశాడా
సుమారు 20 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారు. ట్రంప్ అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయులందరిని వెనక్కి పంపిస్తున్నారు. వీళ్ళందరూ మన దేశం వచ్చాక, వీరు అక్రమంగా వెళ్ళారా లేదా వర్క్ వీసా ఇప్పిస్తానని వీళ్ళను ఎవరైనా ఏజెంట్లు మోసం చేశారా అనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయులందరిని విచారించాలి. అయితే ఇమిగ్రెంట్ అధికారులు, పోలీస్ లు వీళ్లందరినీ దొంగల్లా చూడకుండా వాళ్ళ కధను విని దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలి. ఒక్కొక్కళ్లకి, ఒక్కో గాధ ఉంటుంది.
ఖచ్చితం గా ఇన్ని వేల మంది భారతీయులు అక్కడ ఉన్నారంటే, ఎవరు వాళ్ళను అక్కడకు పంపారు, వాళ్ళ వెనకాల ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అనే అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి, అప్పుడే దోషుల మీద యాక్షన్ తీసుకోవాలి.
భారతీయులను మోసం చేసిన ఏజెంట్ లు, కన్సల్టెన్సీ లు ఎవరు..?
ట్రంప్ చేసిన పనితో వ్యవస్థను చక్కదిద్దే అవకాశం మన దేశానికి లభించింది. ఈ 20 వేల మందిని మోసం చేసిన ఏజెంట్ లను, కన్సల్టెన్సీ లను ఉక్కు పాదం తో అణచివేయడానికి మోడీ ప్రభుత్వానికి ఇదొక మంచి అవకాశం. వీళ్ళను అక్రమంగా తీసుకు వెళ్లిన ఏజెంట్ ల మీద, కన్సల్టెన్సీ ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా తగిన అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి

