దేవి శ్రీ ప్రసాద్, ఈ పేరు చెపితే పూనకాలే. పెద్ద హీరో, చిన్న హీరో, హై బడ్జెట్ సినిమా, లో బడ్జెట్ సినిమా …ఎలాంటి వారికైనా, ఎలాంటి సినిమాకి సంగీతం అందించినా పాటల నుండి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దాకా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. అల్లు అర్జున్ కు పుష్ప-2 ఆల్బం ఇచ్చినా, నాగ చైతన్య తండేల్ ఆల్బం అయినా, ఆ మధ్య వచ్చిన వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమా అయినా సినిమా బ్లాక్ బస్టర్ అవడంలో దేవి శ్రీ తన సంగీతం తో కీ రోల్ ప్లే చేస్తాడని చెప్పవచ్చు
తండేల్ పాటలు సూపర్ హిట్ కావడంతో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రేమ కధా సినిమాలలో పాటలు ప్రేక్షకుల మదిలో లో ఎక్కువ కాలం నిలుస్తాయని అన్నారు.
అల్లు అర్జున్ కు ఆరు ఆరు ప్రేమ పాటలుండే ఒక చేయాలనీ ఉందట. పాటలన్ని మెలోడియస్ గా ఉండాలట. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ , పేపర్ మీద రాసి దేవి శ్రీ ప్రసాద్ కి ఒక మేనిఫెస్టో ల ఆ రాసి ఇచ్చాడట. ఇలాంటి సినిమా ఒకటో మనం చేయాలనీ రాసి, సంతకం చేసి మరి ఇచ్చాడట. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎవరు నిర్మిస్తారో చూడాలి

