తెలుగు సినిమా పుట్టిన రోజు నాడు ఫిలిం ఛాంబర్ అవార్డు లు

by | Feb 6, 2025 | సినిమా

తెలుగు ఫిలిం ఛాంబర్ అతి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుండి ఫిబ్రవరి 6 న తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే సినిమా కు సంబంధించిన అవార్డు లు ఇవ్వాలని నిర్ణయించింది

తెలుగు లో మొదటి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ విడుదలైన రోజు ఫిబ్రవరి 6.  ఈ రోజు నే తెలుగు సినిమా పుట్టిన రోజు గా చేసుకుంటారు

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డు లను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వ అవార్డులతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అవార్డులు కూడా ఉంటాయి. 

తెలుగు సినిమా పుట్టిన రోజున అంటే ఫిబ్రవరి 6 న, ప్రతి థియేటర్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగాలని ఫీల్ ఛాంబర్ తీర్మానించింది. అంతే కాకుండా ప్రతి సినిమా నటుడు కూడా తమ ఇంటిపై జెండా ఆవిష్కరించాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది

అయితే,  తెలుగు సినిమా పుట్టిన రోజు కు సంబంధించిన జెండా రూపకల్పన బాధ్యతను తెలుగు ఫిలిం ఛాంబర్ సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణకు అప్పగించింది

ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్న తెలుగు ఫిలిం ఛాంబర్ ను అభినందించకుండా ఉండలేము