భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 189 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
అంతకు ముందు సౌత్ ఆఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్ లో 159 పరుగులకు అల్ అవుట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దీనితో భారత జట్టుకు 30 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
39 పరుగులు చేసిన కే ఎల్ రాహుల్ (Rahul) భారత జట్టు ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Gill) 4 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెను తిరిగాడు. మూడవ స్థానానికి ప్రమోట్ అయినా వాషింగ్టన్ సుందర్ (Sundar) 29 పరుగులు చేశాడు. రిషబ్ పంత్, జడేజా లు చెరో 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు
సౌత్ ఆఫ్రికా (South Africa) బౌలర్లలో హార్మర్ 4 వికెట్లు తీయగా, జాన్సెన్ 3 వికెట్లు తీశాడు. బాష్, కేశవ్ మహారాజ్ లు తల ఒక వికెట్ తీశారు.
తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టుకు లభించిన 30 పరుగుల ఆధిక్యం తక్కువేమి కాదు. అయితే శుబ్ మన్ గిల్ గాయం గురించే ప్రస్తుత ఆందోళన అంతా.
మ్యాచ్ మొదలైన రెండవ రోజు టీ సమయం కన్నా ముందే మూడవ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యిందంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఫలితం వస్తుందని చెప్పవచ్చు

