SSMB29 మహేష్ బాబు(Mahesh Babu) , రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన విలన్ పాత్రధారి ప్రిథ్వి రాజ్ సుకుమారన్ (కుంభ) ఫస్ట్ లుక్ ను, ఆ తరవాత శృతి హాసన్ పాడిన ఫస్ట్ సింగల్ ను విడుదల చేశారు. ఆ తరవాత హీరోయిన్ పాత్రధారి ప్రియాంక చోప్రా (మందాకినీ) ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిలిం సిటీ లో జరగబోయే లాంచ్ ఈవెంట్ లో ఈ చిత్రం టైటిల్ ను, ఒక విజువల్ తో ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) లో జరగబోయే ఈవెంట్ లో బిగ్ స్క్రీన్ మీద ప్రదర్శించిన తరవాత ఈ టైటిల్ ను ఆన్ లైన్ లోకి విడుదల చేస్తారు. ఇండియా లోనే అతి పెద్ద లాంచ్ ఈవెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. దీనిని జియో హాట్ స్టార్ (Jio Hot Star) వారు సాయంత్రం 6 గంటల నుండి ఎక్సక్లూసివ్ గా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ లాంచ్ ఈవెంట్ కు తెలుగు సమందించి సుమ (Suma) యాంకర్ గా వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే తెలిసింది.
దుర్గ ఆర్ట్స్ పతాకంపై కే ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఎం ఏం కీరవాణి (Keeravani) ఈ చిత్రానికి స్వర సారధ్యం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు అభిమానులు, ఈ సినిమా గురించి రాజమౌళి ఏం చెపుతారా అని ఉత్సాహంతో ఉన్నారు
టైటిల్ మాత్రమే ప్రకటిస్తారా లేదా మహేష్ బాబు (Mahesh Babu) ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్

