16 ఏళ్ళ వయసులో, నవంబర్ 15 న క్రికెట్ గాడ్ సచిన్

by | Nov 15, 2025 | ప్రగడ టీవీ

నవంబర్ 15 కు ఒక ప్రత్యేకత ఉంది.  అదేంటంటే క్రికెట్  గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టిన రోజు.

1989 నవంబర్ 15 న సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తన మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ పై పాకిస్థాన్ లో కరాచీ వేదికగా మొదటి మ్యాచ్ (టెస్ట్ మ్యాచ్) ఆడాడు.  అప్పటికి సచిన్ వయసు 16 సంవత్సరాలు. ఈ మ్యాచ్ లో సచిన్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

అదే నవంబర్ 15, 2013 లో వెస్ట్ ఇండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో సచిన్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ముంబై వాంఖేడ్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో నవంబర్ 15 న బ్యాటింగ్ చేసిన సచిన్ 74 పరుగులు చేశాడు.  ఈ విషయాన్నీ బీసీసీఐ (BCCI) సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

సచిన్ (Sachin) తన కెరీర్ లో 200 టెస్ట్ మ్యాచ్ లలో 15921 పరుగులు 51  సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  వన్డే ల్లో 463 మ్యాచ్లు ఆడి 18 426 పరుగులు చేశాడు.  49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతే కాకుండా వన్ దయాల్లో డబల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు సచిన్ టెండూల్కర్.