‘ఐ బొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీస్ లు అరెస్ట్ చేశారు. ‘ఐ బొమ్మ’ లో ఐ అంటే ఇమ్మడి అని అర్ధం. ఐ బొమ్మ వెబ్ సైట్ నిండా పైరసీ సినిమాలు, ఓటిటి మూవీస్ ఉంటాయి. చాలా మంది కొత్త సినిమాలను ‘ఐ బొమ్మలో’ చూడడం అలవాటు చేసుకున్నారు
నిర్మాతల మండలి ఫిర్యాదు తో పోలీస్ లు ఈ ఐ బొమ్మ నిర్వాహకుల పై దృష్టి సారించారు. ఒకానొక దశలో మమ్మల్ని ఎవరు పట్టుకోలేరని ఐ బొమ్మ నిర్వాహకులు సవాల్ విసిరారు. అయితే పోలీస్ లు చాకచక్యంగా ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పట్టుకున్నారు.
ఐ బొమ్మ టీం ఇండియా నుండి వాళ్ళ కార్యకలాపాలు సాగించట్లేదు. ఈ సినిమాల నిర్వహణకు పెద్ద పెద్ద సర్వర్లు కావాలి. ఈ సర్వర్ల నిర్వహణకు డబ్బు ఎక్కడనుండి వస్తోంది. ఐ బొమ్మ నిర్వాహకులకు, కొంత సినిమాల మాస్టర్ ప్రింట్ కాపీ లు ఎక్కడనుండి వెళుతున్నాయి. ఎవరు ఇస్తున్నారు అనేది తేలాలి. ఐ బొమ్మ వలన సినిమా పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లుతోందని నిర్మాతలు చెపుతున్నారు.
చాలా మంది సినిమా అభిమానులు థియేటర్ కి వెళ్లకుండా ఈ ఐ బొమ్మ సైట్ లో కొత్త సినిమాలు చూసేస్తున్నారు. ఓ టి టి ల వలన ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు అనే కన్నా ఇలాంటి పైరసీ భూతాలు సినీ పరిశ్రమను దెబ్బ కొడుతున్నాయని చెప్పాలి.
పోలిసుల విచారణలో ఇంకెలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి. ఇది మన హైదరాబాద్ పోలీస్ లు సాధించిన విజయం గా చెప్పవచ్చు

